ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి దీక్ష - news on paidikondala manikyala rao

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు విక్రయించాలనే నిర్ణయాన్ని వైకాపా సర్కారు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bjp protest against ysrcp rule
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పైడికొండల మాణిక్యాలరావు దీక్ష

By

Published : May 19, 2020, 3:49 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని భాజపా కార్యాలయంలో మాజీమంత్రి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర భాజపా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు దీక్ష నిర్వహించారు. నల్ల రిబ్బన్లు, బ్యాడ్జీలు ధరించి వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు.

లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి వారిని షాక్ కు గురిచేశారని మాణిక్యాలరావు అన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను, భూములను విక్రయించే విధంగా కొత్తగా తీసుకువచ్చిన జీవో రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి తీసుకువెళ్లేలా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి మాణిక్యాల రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భాజపా అద్వర్యంలో భారీ ఎత్తున ప్రజా దీక్ష చేపడతానని హెచ్చరించారు.

ఇదీ చదవండి : కరోనా వైరస్​ మన దుస్తులకు అంటుకుంటుందా?

ABOUT THE AUTHOR

...view details