ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారాయణపురంలో భాజపా ప్రశిక్షణ తరగతులు ప్రారంభం - పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం

ఉంగుటూరులోని నారాయణపురంలో భాజపా ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ సిద్దాంతాలను, విధి విధానాలను ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తామని నేతలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

bjp-prashikshana-classes
భాజపా ప్రశిక్షణ తరగతులు ప్రారంభం

By

Published : Nov 21, 2020, 8:52 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలోని సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్​లో భాజపా ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలను దేశంలో జరుగుతున్న మార్పులు, విజయాల గురించి వివరించడం జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మారుతీ రాణి పేర్కొన్నారు.

కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పాకా సత్యనారాయణ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details