జైట్లీ మరణం బాధాకరం: భాజపా ఎంపీ జీవీఎల్ - భాజపా ఎంపీ జీవీఎల్
కేంద్ర మాజీ మంత్రిగా.. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా అరుణ్ జైట్లీ దేశానికి సేవ చేశారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. పశ్చిమ గోదావరి జిల్లా గురవాయి గూడెంలో కొనియాడారు.

bjp mp gvl narasimharao
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పూజలు చేశారు. ప్రజా సమస్యలపై బాధితులతో చర్చించేందుకు.. వాటి పరిష్కారం దిశగా తమవంతు శ్రమించేందుకే జిల్లాలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. పామాయిల్, పొగాకు రైతుల సమస్యలు.. పోలవరం నిర్వాసితుల ఇబ్బందులపై దృష్టి పెట్టామన్నారు. భాజపా అగ్ర నాయకుడు అరుణ్ జైట్లీ మరణం చాలా బాధాకరమన్న జీవీఎల్.. ఇలాంటి సందర్భంలో రాజకీయాలపై మాట్లాడనని చెప్పారు.