ఆక్వారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని... మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు వివరించారు. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధి కోసం... కేంద్ర ప్రభుత్వం 20వేల కోట్ల రూపాయలు కేటాయించిందని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన చెప్పారు.
'ఆక్వా అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది' - పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వారంగంపై తాజా వార్తలు
రాష్ట్రంలో ఆక్వారంగం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని... భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆక్వా అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. ఆక్వా రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించి... ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.
bjp member paidikondala Manikyalaravu commenting on Aqua sector at eluru in west godavari district
రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఆక్వాకి సాంకేతికంగా తోడ్పాటు అందించడం, ఉత్పత్తితో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి పెంచడమే లక్ష్యంగా కేంద్రం... ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి:మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు
TAGGED:
Aqua sector latest news