వైకాపా ప్రభుత్వం హిందువులు పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ అన్నారు. భాజపా నాయకుల గృహనిర్బంధం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శుక్రవారం 'చలో అమలాపురం' పిలుపు మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భాజపా నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. హిందువులు, ఆలయాలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఇవాళ భాజపా... చలో అమలాపురం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
'భాజపా నాయకుల గృహ నిర్బంధం దారుణం' - హిందూ దేవాలయాలపై దాడులపై వార్తలు
భాజపా నాయకుల గృహనిర్బంధం దారుణమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తుమ్మల పద్మజ