అయోధ్యలో రామమందిర నిర్మాణంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ రామ శోభాయాత్ర నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు శ్రీ రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారిలో యాత్రను నిర్వహించారు. మహిళల కోలాటం, భజన యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ రామ భక్తి చాటేలా కాషాయ పతాకాలను చేత ధరించి భక్తులు యాత్రలో పాల్గొనటం మరింత శోభను సంతరించింది. యాత్రలో రామమందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించారు.