ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారుల గోతుల్లో పూలుజల్లి భాజపా, జనసేన వినూత్న నిరసన - west godavari bjp leaders latest news

రహదారులపై గోతులు పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ భాజపా, జనసేన నాయకులు వాపోయారు. రహదారిపై ఉన్న గోతుల్లో పూలు జల్లి తమ నిరసన తెలిపారు.

bjp and janasena leaders protest
గోతుల్లో పూలు జల్లుతున్న భాజపా, జనసేన నాయకులు

By

Published : Oct 11, 2020, 9:14 AM IST

దెందులూరు మండలం దోసపాడు, పోతునూరు గ్రామాల్లోని ప్రధాన రహదారిని భాజపా, జనసేన నాయకులు పరిశీలించారు. ప్రధాన రహదారిపై ఉన్న గోతుల్లో పూలు జల్లి తమ నిరసన వ్యక్తం చేశారు. రహదారులపై గోతులను పూడ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని భాజపా జిల్లా ఉపాధ్యక్షులు చౌటపల్లి విక్రమ్​ కిషోర్​ అన్నారు. రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు ఆధ్వానంగా ఉండటం వల్ల నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా నాయకులు విజయదాసు, ప్రభు, జనసేన నాయకులు సుగుణరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details