పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంపై భాజపా, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. అంజనేయ స్వామి ఆలయ సమీపంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీని పెట్టిన రెండు గంటల వ్యవధిలోనే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజలపై దాడులు పెరగడానికి ఈ ఫ్లెక్సీ ధ్వంసమే ఉదాహరణని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఫ్లెక్సీ ధ్వంసం చేశారని భాజపా, జనసేన ఆందోళన - westgodavari district newsupdates
గోపీనాథపట్నంలో ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంపై భాజపా, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
ఫ్లెక్సీ ధ్వంసం చేశారని భాజపా, జనసేన ఆందోళన