కరోనా వల్ల వలసకూలీలు.. ఎంతోమంది మరణిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు ఇంటికి వెళ్లడానికి కాళ్లనే నమ్ముకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రామచంద్రపురంలో బిహార్‌కు చెందిన వలస కూలీలు కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. వీరంతా గ్రామంలో మొక్కజొన్న విత్తన పరిశ్రమలో పని చేస్తున్నారు. రెండు నెలలుగా పరిశ్రమ మూతపడడంతో ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండిలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ స్వస్థలాలకు పంపాలని పలుసార్లు అధికారులకు విన్నవించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు 100 మంది వలస కూలీలు కాలినడకన బిహార్‌కు బయల్దేరారు.
అధికారులు పట్టించుకోట్లేదని.. కాలినడకన స్వస్థలాలకు.. - రామచంద్రపురంలో బీహార్ వలసకూలీల కాలినడక వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీల వ్యథలు వర్ణాతీతం. చేసేందుకు పని లేక, తిండి లేక ఎన్నో బాధలు పడుతున్నారు. ఇప్పటి వరకు వారితో పనిచేయించుకున్న యజమానులు, ఇప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బిహార్‌కు చెందిన వలస కూలీలు.. కాలినడకన స్వస్థలాలకు తరలిపోతున్నారు.
రామచంద్రపురంలో బీహార్ వలసకూలీల కాలినడక