ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్​గా భూపతి ఆదినారాయణ - Nidadavolu Municipality news

నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్​గా భూపతి ఆదినారాయణ, వైస్ చైర్​పర్సన్​గా గంగుల వెంకటలక్ష్మిలు ఎన్నికయ్యారు. పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Bhupathi Adinarayana
నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్​గా భూపతి ఆదినారాయణ ఎన్నిక

By

Published : Mar 18, 2021, 5:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ప్రత్యేకాధికారి పద్మావతి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఛైర్మన్​గా భూపతి ఆదినారాయణను... అధికార పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపరచగా కౌన్సిలర్లు అందరూ చేతులెత్తి మద్దతు తెలిపారు. వైస్ ఛైర్​పర్సన్​గా గంగుల వెంకటలక్ష్మిని అదే తరహాలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరిలో.... కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు సైతం చేతులెత్తి మద్దతు తెలపడం విశేషం. చైర్మన్ వైస్ చైర్​పర్సన్ గా ఎన్నికైన భూపతి ఆదినారాయణ, గంగుల వెంకటలక్ష్మిలకు ప్రత్యేక అధికారి పద్మావతి ధ్రువ పత్రాలను అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారంలో నిబంధనలకు కట్టుబడి పురపాలక సంఘం అభివృద్ధిపరచాలని సూచించారు.

సంక్షేమ కార్యక్రమాల అమలు ఫలితమే పురపాలక సంఘాల్లో విజయం సాధించి పెట్టిందని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చడానికి కొత్త పాలక వర్గం కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details