ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BAD ROADS: ఈ రోడ్లపై ఆయన బాగానే తిరుగుతున్నారు..ఇంకా వైకాపా ఎమ్మెల్యే ఏమన్నారంటే..! - bad roads

పశ్చిమగోదావరి జిల్లాలోని రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణ సర్వత్రా చర్చకు దారితీసింది. జిల్లాలోని రోడ్లపై ప్రజలు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొందని వైకాపా నేత చేసిన కామెంట్ హాట్ టాపిక్​గా మారింది.

BAD ROADS
BAD ROADS

By

Published : Sep 6, 2021, 6:03 PM IST

రోడ్ల స్థితిపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రహదారుల దుస్థితిపై తన ఆవేదనను వెళ్లగక్కారు. భీమవరంలో దళిత, క్రైస్తవ సంఘాలు, చర్చి పాస్టర్ల ఆధ్వర్యంలో నిన్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో తిరుపతి ఎంపీ గురుమూర్తిని, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజులను ఘనంగా సన్మానించారు. అధ్వానంగా ఉన్న రోడ్లపై.. ఎమ్మెల్సీ మోషేన్​రాజు ఎంతో ఓపికతో తిరగడాన్ని అభినందించారు.

తరచూ ఏలూరు కలెక్టర్​లో నిర్వహించే సమావేశాలకు హాజరై తిరిగి రావడానికి తాను భయపడుతున్నానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మోషేన్‌రాజుకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ఈ రోడ్లపై తిరుగుతూ ఎంతోమందిని కలవడాన్ని కొనియాడారు. రోడ్ల దుస్థితిపై అధికార పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఎమ్మెల్యే మాటలకు నివ్వెరపోయారు. ఏదేమైనా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details