పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావును కిడ్నాప్ చేసిన దుండగులు... తెలంగాణలోని ఖమ్మంజిల్లాలో దారుణంగా హత్య చేశారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. భీమవరంలో రోయ్యల వ్యాపారం చేసే కోదండరామారావు నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. తన భర్త ఆచూకీ తెలియట్లేదంటూ మృతుని భార్య లీలా ఈనెల 11న భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భీమవరం రొయ్యల వ్యాపారి దారుణ హత్య - bhimavaram updates
నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన భీమవరం రొయ్యల వ్యాపారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ నెల 11 తన భర్త కనిపించటంలేదని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భీమవరం రొయ్యల వ్యాపారి దారుణ హత్య