విశాఖ భీమిలి బీచ్‌లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన లోకేశ్ అనే యువకుణ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ.35 లక్షలు చెల్లిస్తేనే విడిచిపెడతామని భీమవరంలో ఉంటోన్న లోకేశ్ తల్లి వరలక్ష్మికి ఫోన్లు చేసి బెదిరించారు. డబ్బు కోసం కిడ్నాపర్లు లోకేశ్‌ను చిత్రహింసలు పెట్టి ఆ వీడియోలను వరలక్ష్మికి పంపారు. ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. విషయం పోలీసులకు తెలియటంతో భయపడిన దుండగులు లోకేశ్‌ను.. నిన్న అర్ధరాత్రి భీమవరం పద్మాలయ థియేటర్ సమీపంలో వదిలి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న లోకేశ్‌ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న లోకేశ్ పరిస్థితి విషమంగా ఉంది. తనను కిడ్నాప్ చేసింది గన్‌మెన్ పడమటి పాండురాజు, అతని బంధువులు అని బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు.
బెట్టింగ్ వివాదంతో యువకుడి కిడ్నాప్ - man kidnapped of betting money
బెట్టింగ్ ఆడి డబ్బులు కట్టలేదని ఓ యువకుణ్ని కిడ్నాప్ చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. అత్యాశకు పోయి ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో లక్షలు బెట్టింగ్ కాశాడు. ఓడిపోయిన అతను డబ్బులు తిరిగి చెల్లించలేదు. నగదు ఇవ్వలేదని యువకుణ్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. అతన్ని హింసించి ఆ వీడియోలు అతని తల్లికి పంపి రూ.35 లక్షలు చెల్లించాలని బెదిరించారు.
బెట్టింగ్ వివాదంతో యువకుడు కిడ్నాప్