పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్ కేసులో మరో నలుగురును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన ఓ యువకుడిని చెన్నై కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేయడంతో భీమవరంలో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం బయటకు వచ్చింది.
భీమవరం డ్రగ్స్ రాకెట్ కేసు... మరో నలుగురు అరెస్టు - భీమవరంలో డ్రగ్స్ కలకలం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి డ్రగ్స్ తీసుకువస్తూ.. చెన్నై కస్టమ్స్ అధికారులకు ఓ యువకుడు పట్టుబడ్డాడు. ఈ కేసుపై విచారణ జరిపిన భీమవరం పోలీసులు... మొత్తం 15 మందికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉన్నట్లు తేల్చారు. వీరోలో ఆరుగురిని గతంలో అరెస్టు చేయగా.. తాజాగా మరో 4 గురిని అరెస్టు చేశారు.
భీమవరం డ్రగ్స్ రాకెట్ కేసు... మరో నలుగురు అరెస్టు
ఈ కేసులో గత నెల 23వ తేదీన ఆరుగురిని భీమవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో కౌశిక్ వర్మ, పృథ్వీరాజ్, ప్రసాద్, రాజీవ్ అనే మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు కిలో గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి :సీఎంవోలో శాఖలన్నీ ఆ ముగ్గురికే