పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని భీమవరం పట్టణంలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ బెడ్లు దొరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సొంత ఖర్చులతో 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేసి సబ్ కలెక్టర్ విశ్వనాథన్కి అందజేశారు.
రూ.45 లక్షలతో..
ఎమ్మెల్యే స్ఫూర్తితో భీమవరం నియోజకవర్గలో అధికార వైకాపా నాయకులు, దాతలు ముందుకు వచ్చి మరో 56 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించారు. భీమవరంలో సుమారు రూ.45 లక్షలతో 76 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.