ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులతో సున్నితంగా ప్రవర్తించాలి : డీపీఓ - grama sabha in west godavari district

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దెందులూరు మండలం పెరుగుగూడెంలో గ్రామసభ నిర్వహించారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే అవి విజయవంతం అవుతాయని జిల్లా పంచాయతీ శాఖ వెల్లడించింది.

పారిశుద్ధ్య కార్మికులతో సున్నితంగా ప్రవర్తించాలి : డీపీఓ
పారిశుద్ధ్య కార్మికులతో సున్నితంగా ప్రవర్తించాలి : డీపీఓ

By

Published : Oct 2, 2020, 5:24 PM IST

గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ప్రజల భాగస్వామ్యం అవసరం..

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చి చెత్త సేకరింపజేయడం పెద్ద సమస్య కాదని.. ఈ పథకం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్య అవసరమని ఆయన వెల్లడించారు. ఈ కారణాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని పథకంలో భాగస్వామ్యం చేసిందన్నారు.

పారిశుద్ధ్య కార్మికులతో సున్నితంగా ప్రవర్తించాలి : డీపీఓ

సున్నితంగా ప్రవర్తించాలి..

చెత్త సేకరించే వారి పట్ల ప్రజలు దురుసుగా కాకుండా సున్నితంగా ప్రవర్తించాలన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్లను జిల్లా పంచాయతీ అధికారి సత్కరించారు. సంపద కేంద్రాన్ని పరిశీలించి వర్మి కంపోస్ట్ తయారీకి సంబంధించి వానపాములను అందులో వదిలారు.

మొక్కలు నాటారు..

చల్ల చింతలపూడిలో సంపద కేంద్రాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం దెందులూరులో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలోని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఆయా గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులతో సున్నితంగా ప్రవర్తించాలి : డీపీఓ

ఇవీ చూడండి : సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details