తరతరాలుగా కాపుల్లోనూ పేదలు ఉన్నారని.. మన శత్రువు పేదరికమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని వెంకటరమణ అతిథిగృహంలో నిర్వహిచిన కాపు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తరతరాలుగా పోరాడినా దానిని జయించలేకపోయామన్నారు. ప్రస్తుతం పేదరికంతో బాధపడుతున్న కాపుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మంత్రితో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఉన్నారు.
కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం: బీసీ సంక్షేమ శాఖ మంత్రి - bc welfare minister in kapu nestam meeting
కాపుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. పాలకొల్లులో నిర్వహించిన కాపు నేస్తం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
కాపు నేస్తం కార్యక్రమంలో మంత్రి