ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెందులూరులో బాస్కెట్​బాల్​ వేసవి శిక్షణా శిబిరం

బాస్కెట్​బాల్​ వేసవి శిక్షణా శిబిరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని ప్రజా ఉన్నత పాఠశాలలో జరుగుతోంది. నెలరోజుల శిక్షణలో విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారు.

దెందులూరులో బాస్కెట్​బాల్​ వేసవి శిక్షణా శిబిరం

By

Published : May 21, 2019, 1:36 PM IST

Updated : May 21, 2019, 3:48 PM IST

దెందులూరులో బాస్కెట్​బాల్​ వేసవి శిక్షణా శిబిరం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని ప్రజా ఉన్నత పాఠశాలలో బాస్కెట్​ బాల్​ వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులపాటు జరిగే శిక్షణలో స్థానిక విద్యార్థులు 20 మంది శిక్షణ పొందుతున్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మోటపర్తి బాపినీడు పర్యవేక్షణలో బాస్కెట్​ బాల్​ శిక్షకుడు రవికుమార్... విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత రెండేళ్ళుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి పోటీలకు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మరో 10 రోజుల్లో ముగిసే ఈ శిక్షణలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : May 21, 2019, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details