ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ధర్నా - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నారు.

తణుకులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ధర్నా
తణుకులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ధర్నా

By

Published : Mar 15, 2021, 4:18 PM IST

పశ్చిమగోదావరి తణుకులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ మినహా మిగిలిన అన్ని రాజకీయపక్షాలు మద్దతిచ్చాయి. అధికారి వైకాపాతో పాటు తెదేపా, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సమ్మెకు మద్దతు పలికారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సామాన్యులకు బ్యాంకు సేవలు దూరమవుతాయని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు లేకపోవడమే కాక ఉచిత బ్యాంకు సేవలు రద్దు అవుతాయని చెప్పారు.

ఇదీ చదవండి: 17 మంది కౌన్సిలర్లతో.. అజ్ఞాతంలోకి వైకాపా ప్రజాప్రతినిధి?

ABOUT THE AUTHOR

...view details