ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లబ్ధిదారుల పేరుతో 30 లక్షలు మాయం...బ్యాంకు ఉద్యోగులు అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని డీసీసీబీలో రజకుల రుణ మంజూరులో భారీ అక్రమాలు జరిగాయి. దర్యాప్తు చేసిన పోలీసులు బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు.

bank employees arrest  in dccb scam at eluru
ఏలూరులో డీసీసీబీ బ్యాంకులో ఉద్యోగులు అరెస్ట్

By

Published : Feb 6, 2021, 12:01 PM IST

పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీలో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. డీసీసీబీ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి వ్యక్తులను అరెస్టు చేశారు. లబ్ధిదారుల పేరుతో 30 లక్షలు రూపాయల రుణాలను బ్యాంకు సిబ్బంది తీసుకొన్నారు. రుణాలు చెల్లించాలంటూ.. బాధితులకు నోటీసులు రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు బాధితులకు రుణాలే ఇవ్వలేదని తేలింది. బ్యాంకు నుంచి ఇచ్చిన రుణాలు లబ్ధిదారులకు అందించకుండా సిబ్బంది పంచుకొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన మేనేజర్లు మురళీకృష్ణ, రామగోపాల్, సిబ్బింది చిట్టిబాబు, విజయ్ భాస్కర్, అచ్యుత్ రావు, శ్రీనివాసరావులను పోలీసులు అరేస్టు చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఇదీ చూడండి.పల్లె సారధి విలువల వారధి

ABOUT THE AUTHOR

...view details