హనుమాన్ జయంతిని పురస్కరించుకుని.. భజరంగదళ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. గతంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించేవారు.
ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలున్నందున ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో 200 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు భజరంగదళ్ సభ్యులు తెలిపారు.