వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని దివ్యాంగురాలన్న కనికరమైనా లేకుండా ప్రియుడితో కలిసి ఓ తల్లి ఆమెను హతమార్చింది. పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లకు చెందిన రవికిరణ్‌కు, గౌరీపట్నానికి చెందిన మంగమ్మకు వివాహేతర సంబంధముంది. ఆమెకు ఆరేళ్ల దివ్యాంగురాలైన పాప ఉంది. ఏడు నెలల క్రితం కూతురు భవానితో కలిసి మంగమ్మ... రవికిరణ్‌ఇంటికి వెళ్లిపోయి అప్పట్నుంచి అక్కడే ఉంటోంది. తమ సంబంధానికి కూతురు అడ్డొస్తుందన్న కారణంతో వారిద్దరూ కలిసి సుమారు నెల క్రితం భవానిని హత్య చేసి ఉంగుటూరు మండలం నల్లమాడు శివార్లలో పాతిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావటంతో రవికిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోదంతం బయటపడింది. రవికిరణ్‌తో పాటు మంగమ్మ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతంలో చేబ్రోలు రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీత ప్రారంభించారు.
దారుణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్న కూతురి హత్య - west godavari district crime news
మాతృత్వాన్ని పంచాల్సిన ఆ తల్లి... తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. గోరుముద్దలు తినిపించాల్సిన చేతుల్తో అత్యంత దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్నపేగునే కడ తేర్చింది. దివ్యాంగురాలన్న కనికరం లేకుండా ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లమాడులో జరిగింది.
వాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్న కూతురి హత్య