పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్ల చింతలపూడి వద్ద పోలవరం కుడి కాలువలో ఏడాదిన్నర వయసున్న బాలిక మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. పోలీసుల వివరాల ప్రకారం... దెందులూరు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మికి నరేష్ అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో శనివారం సుబ్బలక్ష్మి తన చిన్నకుమార్తెను ప్రళయ సీతాశ్రీని తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం ప్రళయ సీతాశ్రీ మృతదేహం పోలవరం కుడి కాలువలో తేలింది. తల్లి కూడా కాలువలోకి దూకి ఉండవచ్చుననే అనుమానంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించినా... ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
పోలవరం కుడి కాలువలో ఏడాదిన్నర బాలిక మృతదేహం - baby died in polavaram right canal
పోలవరం కుడి కాలువలో ఓ బాలిక మృతదేహం తేలింది. తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
పోలవరం కుడికాలువలో ఏడాదిన్నర బాలిక మృతదేహం