ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవజాత శిశువు మృతి...  బంధువుల ఆందోళన - అప్పుడే పుట్టిన శిశువు మృతి..వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ !

అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిదని బంధువులు ఆరోపించారు.

అప్పుడే పుట్టిన శిశువు మృతి..వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ !
అప్పుడే పుట్టిన శిశువు మృతి..వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ !

By

Published : May 26, 2020, 11:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. యలమంచిలి మండలం పోలవరానికి చెందిన సాయిలక్ష్మి ప్రసవానికి పుట్టిల్లు లక్ష్మణేశ్వరం వచ్చింది. పురిటి నొప్పులు రావటంతో ఈ నెల 23న నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేసి పాపను బయటకు తీశారు. వైద్యులు సూచన మేరకు శిశువును చిన్నపిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడకు వెళ్ళే సమయానికి శిశువు మృతిచెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందిందని... బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వైద్యురాలు డా.రత్నకుమారిని వివరణ కోరగా... శస్త్రచికిత్స చేసి శిశువును తీసే సమయానికి ఆరోగ్యంగా ఉందన్నారు. చిన్నపిల్లలు వైద్యులు లేకపోవడంతో... వేరేచోట పిల్లలు వైద్యులకు చూపించాలని సిఫార్సు చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details