ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీటెక్​ మధ్యలో ఆపేసి హ్యాకరయ్యాడు... చివరకు అరెస్టయ్యాడు - b tech hacker in ap arrested

తన ఫోన్లో తీసిన చిత్రాలు..మాట్లాడిన మాటలు..ఛాటింగ్స్​ తిరిగి  ఆమె మొబైల్​కే మెయిల్స్​లాగా​ వస్తున్నాయి. ఆశ్చర్యపోయినా ఆ మహిళా విశాఖ సైబర్​ పోలీసులను ఆశ్రయించింది. సీన్​ కట్​చేస్తే విశాఖలో బీటెక్​ హ్యకర్​ అరెస్టయ్యాడు. అసలేం జరిగిందంటే...

పశ్చిమగోదావరి హ్యకర్​

By

Published : Sep 12, 2019, 2:29 PM IST

విశాఖలో బీటెక్​ హ్యకర్​ అరెస్ట్​!
విశాఖకు చెందిన ఓ మహిళ మొబైల్​కు తన వ్యక్తిగత సమాచారంతో కూడిన చిత్రాలు, సంభాషణలు మెయిల్స్​ రూపంలో వచ్చేవి. ఆశ్చర్యపోయిన మహిళ నగర సైబర్​క్రైమ్​ విభాగాన్ని ఆశ్రయించింది. హ్యకింగ్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరగాన్ని గుర్తించి అరెస్ట్​ చేశారు. పశ్చిమగోదావరికి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన కాటూరి శైలేష్​ ఈ సైబర్​ నేరాలకు పాల్పడినట్లు సీఐ గోపినాథ్​ వెల్లడించారు. నిందితుడు బీటెక్​(ఐటీ) చదువు మధ్యలో ఆపేశాడు. వెబ్​డెవలపింగ్​, ఫిషింగ్​, ఆండ్రాయిడ్​ విభాగాల్లో పట్టు సాధించి హ్యకింగ్​ చేస్తున్నాడు. గతంలోనూ ఓ మహిళను ఇలాగే బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. ఎట్టకేలకు విశాఖలో హ్యకర్​ అరెస్టయ్యాడని.. నిందితుడిని రిమాండ్​కు​ తరలించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details