ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు - ఏలూరులో ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేదిక్, పంచకర్మ హాస్పిటళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.

Ayurveda Day celebrations
ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

By

Published : Nov 13, 2020, 3:12 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొవిడ్​కు​ సంబంధించి దేశవాళీ ఉత్పత్తుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యదర్శితో ప్రధాని మాట్లాడటం శుభపరిణామం అని జిల్లా ఆయుర్వేద సూపరింటెండెంట్​ నగేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేదిక్, పంచకర్మ హాస్పిటళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details