వనామి రొయ్యల సాగులో సంక్రమించే వివిధ రకాల వ్యాధులు, నివారణ మార్గాలపై రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి మత్స్య కేంద్రంలో అవగాహన కల్పించారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే వనామి రొయ్యల సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర మత్స్య శాఖ శిక్షణా కేంద్రం (కాకినాడ) ప్రిన్సిపాల్ పి.కోటేశ్వరరావు అన్నారు. నాణ్యమైన, వ్యాధులు లేని పిల్లలను ఎంచుకోవాలని సూచించారు. మందులు యాంటీబయోటిక్స్ విచక్షణారహితంగా వినియోగించకూడదని తెలిపారు. వైరస్ వ్యాధులకు సరైన చికిత్స లేదని మూడు నుంచి నాలుగు వారాలు పాటు చెరువులను ఎండ పెట్టాలని సహాయ సంచాలకుడు సైదా నాయక్ స్పష్టం చేశారు.
వనామి రొయ్యల సాగులో వ్యాధులు, నివారణపై రైతులకు అవగాహన - ఉంగుటూరులో వనామి రొయ్యల సాగుపై అవగాహన
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి మత్స్య కేంద్రంలో వనామి రొయ్యల సాగులో సంక్రమించే తెల్ల మచ్చ తెగులు, బాహ్య రక్త వ్యవస్థలో వచ్చే నెక్రోసిన్ వైరల్ వ్యాధులపై ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వనామి రొయ్యల సాగులో సంక్రమించే వ్యాధులు, నివారణపై రైతులకు అవగాహన