ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో దొంగ అరెస్ట్.. వాహనం స్వాధీనం - Auto thief arrested at Duvva

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద ఆటో దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Auto thief arrested at Duvva
దువ్వ వద్ద ఆటో దొంగ అరెస్ట్

By

Published : Aug 27, 2020, 7:25 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద ఆటో దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఆటో అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు.

ఈనెల 22వ తేదీన ఇంటి వద్ద ఉంచిన ఆటో అపహరణకు గురైంది. దువ్వ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... అపహరణ చేసిన ఆటో అమ్మడానికి తీసుకెళ్తున్న మతుకుమిల్లి మోజెస్ అనే వ్యక్తిని గుర్తించారు. విషయం తెలుసుకుని ఆటోను సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details