పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. ఈ ఘటలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి...మిగిలిన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టింపాలెేనికి చెందిన 11 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గడ్డి పనుల నిమిత్తం అలంపురం వస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా...విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతును ఢీ కొట్టి బోల్తా పడింది. కారు డ్రైవరు నిద్రమత్తులో ఆటోను ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలంపురం జాతీయ రహదారిపై ఆటో బోల్తా...12 మందికి గాయాలు - పెంటపాడులో ఆటో బోల్తా
ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం జాతీయ రహదారిపై జరిగింది.
అలంపురం జాతీయ రహదారిపై ఆటో బోల్తా...12 మందికి గాయాలు