ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి నుంచి మూడు డెల్టాలకు నీటిని వదిలిన అధికారులు - bhadrachalam godavari flood

పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నుంచి మూడు డెల్టాలకు నీటిని వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

Authorities released water from the Godavari to three deltas
గోదావరి నుంచి మూడు డెల్టాలకు నీటిని వదిలిన అధికారులు

By

Published : Sep 2, 2020, 11:23 AM IST

పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నుంచి మూడు డెల్టాలకు 9,800 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. పశ్చిమడెల్టాకు 5 వేలు, తూర్పుడెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఏలూరు కాలువకు 737, ఉండి కాలువకు 876 , జీఅండ్‌వీ కాలువకు 673, అత్తిలి కాలువలోకి 431 ,నరసాపురం కాలువకు 1,704 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు విడుదల చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం40.70 అడుగులకు చేరింది. 10 గంటలకు 41 అడుగుల వద్ద ఉంది. గోదావరిలో 7,72,359 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఇదీ చూడండి.ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

ABOUT THE AUTHOR

...view details