పశ్చిమగోదావరిజిల్లాలో పోలీసులు పేకాట స్థావరాలపై ఏకకాలంలో దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో 120మందిని అరెస్టుచేశారు. వారివద్ద నుంచి 2లక్షల నగదు, 22ద్విచక్రవానాలు స్వాధీనం చేసుకొన్నారు. జిల్లాలో 17క్లబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్ లు, ఇతర అసాంఘిక కార్యాకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీనవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. క్లబ్బుల్లోను తరుచు తనిఖీలు చేపడుతామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, అక్రమాలు జరుగుతున్న తెలిస్తే సమాచారం అందించడానికి వాట్సస్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పేకాట స్థావరాలపై దాడులు...120 మంది అరెస్ట్ - 120 people arrested
ఏకకాలంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు 120 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారినుంచి 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరాలపై దాడులు...120 మంది అరెస్ట్