ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి లేని పురుగుమందుల విక్రయాలు.. వ్యాపారులపై కేసులు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో ఎరువులు, పురుగు మందుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వల్లో వ్యత్యాసం గుర్తించి రూ.4.44 లక్షల రూపాయల విలువ గల ఎరువులను సీజ్ చేశారు.

By

Published : Jul 20, 2020, 10:41 PM IST

west godavari district
పంగిడిగూడెంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల పై దాడులు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో లక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల పురుగు మందుల దుకాణంలో ఎరువుల వ్యత్యాసం గుర్తించారు. రూ.4 .44 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం 1955 లోని సెక్షన్ 6(ఎ ) ప్రకారం కేసు వేశారు.

అడమా, బేయర్, ఎఫ్ఎంసీ, ఇండోఫిల్, టాటా, క్రిస్టల్ కంపెనీల పురుగుమందులను అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రూ.48 వేల విలువ చేసే ఈ పురుగు మందుల అమ్మకాలను నిలిపేశామని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులైన ఏవో ఎం శ్రీనివాస్ కుమార్, ఎస్సై కె . ఏసుబాబు, స్థానిక వ్యవసాయ అధికారి దుర్గా రమేష్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details