ప్రేమవివాహం చేసుకుందామని బయల్దేరారు... అంతలోనే... - attack on lovers news in west godavari
ప్రేమ వివాహం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తున్న ఓ ప్రేమజంటను బంధువులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని విద్యుత్ స్తంభానికి కట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో వివాహం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తున్న ప్రేమజంటను బంధువులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టి... తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన విజయరాజు, లావణ్య ప్రేమించుకున్నారు. వారు వివాహం చేసుకోవడానికి పాలకొల్లుకు బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు దిగమర్రు గ్రామం వద్ద ప్రేమ జంటను అడ్డుకున్నారు. మా అమ్మాయిని తీసుకెళ్తావా అంటూ యువకుడిని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. అనంతరం యువతి బంధువుల్లో పలువురు అతనిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని విడిపించారు. బాధితుడు విజయరాజు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.