పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజవర్గం జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలవరం సీఐ ఏఎన్ఎం మూర్తి రాష్ట్రంలో ప్రవహించే వాహనాల అనుమతి పత్రాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న 17 మంది ఉద్యోగులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వారందరి వివరాలు సేకరించి రాష్ట్రంలోకి అనుమతించారు.
లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఎటువంటి అనుమతి లేకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలి వస్తున్న వారిని అడ్డగించి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఆదేశాలతో ముందుకు పంపిస్తున్నారు. 24 గంటల పాటు రాష్ట్ర సరిహద్దులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ప్రాథమిక పరీక్ష నిర్వహించి ఆంధ్ర రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.