అన్నపూర్ణమ్మకు అష్టోత్తర కలశాభిషేకం - అన్నపూర్ణమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం
పంచారామ క్షేత్రంలో అన్నపూర్ణమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో... అన్నపూర్ణమ్మ వారికి అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా లోకకళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అభిషేకాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశంలో ఎక్కడా లేని లేని విధంగా.. ఇక్కడి అన్నపూర్ణమ్మ అమ్మవారు శివుని శిరస్సు పైభాగాన దర్శనమిస్తారు. విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరం అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారీ నిర్వహించిన వేడుకకు..రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.