పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంకకు చెందిన ఆశావర్కర్లు.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. గ్రామానికి చెందిన రాణీ, సుశీల అనే ఇద్దరు ఆశావర్కర్లు మూడు రోజుల కిందట కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచే తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్లకు స్వల్ప అస్వస్థత - ఆశా వర్కర్లు అస్వస్థత న్యూస్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆశావర్కర్లు స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆగడాల లంకలో జరిగింది.
వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్లకు స్వల్ప అస్వస్థ