ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప.గో జిల్లాలో 40 మంది క్రైస్తవ మత ప్రచారకుల అరెస్టు - evangelists arrest in west godhavari

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. గుంపులుగా గుంపులుగా తిరగొద్దంటూ 144 సెక్షన్ అమల్లో పెట్టినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 40మంది క్రైస్తవ మత ప్రచారకులు రాగా పోలీసులు అరెస్టు చేశారు.

Arrest of 40 evangelists
ప.గో జిల్లాలో 40 మంది క్రైస్తవ మత ప్రచారకుల అరెస్టు

By

Published : Mar 24, 2020, 4:50 PM IST

ప.గో జిల్లాలో 40 మంది క్రైస్తవ మత ప్రచారకుల అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 40 మంది క్రైస్తవ మత ప్రచారకులను పోలీసులు అరెస్టు చేశారు.కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన వారంతా...బస్సులో వచ్చి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా... వారిని అదుపులోకి తీసుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున 40 మందిపై కేసులు నమోదు చేశారు. బస్సును స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి-దురుద్దేశంతో కరోనా వ్యాప్తి చేస్తే రెండేళ్ల జైలు..!

ABOUT THE AUTHOR

...view details