ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిపందాల కోసం జోరుగా ఏర్పాట్లు - కోర్టులు వద్దనా కోడి పందాల నిర్వహణకు ముస్తాబవుతున్న పశ్చిమగోదావరి పందెం రాయుళ్లు

సంక్రాంతి సందర్భంగా కోడిపందాల నిరోధానికి హైకోర్టు, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. పండుగ మూడు రోజులు నిర్వహించి తీరుతామని పందెం రాయుళ్లు చెబుతున్నారు. పశ్చిమగోదావరిలో మారుమూల ప్రాంతాల్లోనే కాక జాతీయ రహదారుల పక్కనా బరులు ఏర్పాటు చేస్తూ.. పందెంరాయుళ్లు పోలీసులకు సవాలు విసురుతున్నారు.

cock fight places ready in west godavari
తూర్పు గోదావరిలో కోడిపందాల బరులు సిద్ధం

By

Published : Jan 9, 2021, 7:43 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతికి ముందే కోడిపందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా కోడిపందాలను నిషేధిస్తూ కోర్టులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. పండుగ మూడురోజులూ జరిపి తీరుతామని పందెంరాయుళ్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా బరులను తయారు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా.. జాతీయ రహదారి పక్కనా వాటిని ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

గతంలో పందాలు నిర్వహించిన చోట మళ్లీ నిర్వహిస్తారనే ఉద్దేశంతో.. ఆయా ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడిపందాలను నిరోధించాల్సిందేనని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పందెంరాయుళ్లు అవేవీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. బరితెగించి బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తణుకు సర్కిల్ పరిధిలో 500 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు నాలుగు వేల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు పందెం రాయుళ్ల బరితెగింపు, మరోవైపు పోలీసుల నిరోధక చర్యలు కొనసాగుతుండగా.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details