పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పంచాయతీ రెండోదశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. 13 మండలాల్లో 195 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లోని ప్రతి మండల కార్యాలయం వద్ద సమీప పాఠశాలల్లో సామగ్రి పంపిణీ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులు.. పంచాయతీ వార్డులు వారిగా పోలింగ్ సజావుగా సాగడానికి, పోలింగ్ వివరాలు నమోదు చేయడానికి అవసరమైన పత్రాలను, బ్యాలెట్ బాక్సులను సిబ్బందికి అందజేశారు.
నిర్దేశించిన మార్గాల్లో పోలింగ్ కేంద్రాలకు సామగ్రి...