ఎన్నికల సమయంలో తన కోసం కృషి చేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలకు ఆరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ద్వారా ప్రజలను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అందరం కలిసిగట్టుగా ముందుకు సాగుదామని చెప్పారు.
తణుకులో సమీక్ష.. ఓటమిపై సమాలోచన - పశ్చిమగోదావరి జిల్లా
తణుకులో ఓటమిపై తెదేపా సమీక్ష నిర్వహించింది. పరాజయానికి గల కారణాలపై సమాలోచనలు చేసింది. అక్కడి తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.
ఆరిమిల్లి రాధాకృష్ణ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ ఓటమికి కారణమైన అంశాలపై సమీక్షించారు. పలు గ్రామాల్లో స్థానిక నాయకులు చేసిన చిన్నచిన్న తప్పిదాలు ఓటమికి ఓ కారణమని తెదేపా ముఖ్యనేత వై.టి రాజా అన్నారు.
ఇదీ చదవండీ...మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ