పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో శనివారం రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. ప్రారంభ సమయంలో మాజీ మహిళా సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రిబ్బన్ కటింగ్ చేస్తుండగా స్థానిక వైకాపా నాయకుడు మహిళా సర్పంచ్‌ను పక్కకు నెట్టడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా సర్పంచ్ వర్గీయులు.. తాము ఎస్సీ అయినందువల్ల మరో వర్గం వారు తమను అవమానించారంటూ రహదారిపై ఆందోళనకు దిగారు.
రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవంలో వాగ్వాదం - రైతు భరోసా కేంద్ర వార్తలు
రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైకాపాలోని ఇరు వర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మేరకు తమను అవమానించారంటూ ఒక వర్గం వారు రహదారిపై ఆందోళన చేపట్టారు.
![రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవంలో వాగ్వాదం Argument at the inauguration of the raithu bharosa center at T. NARSAPURAM in west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7415088-952-7415088-1590895882600.jpg)
Argument at the inauguration of the raithu bharosa center at T. NARSAPURAM in west godavari