పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు లక్షా 75వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో సుమారు 78వేల ఎకరాల్లో చేపల చెరువులు, 97 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. కరోనా ఉద్ధృతి, కర్ఫ్యూ ఆంక్షల వల్ల ధర పతనమవడమే కాక ఇతర రాష్ట్రాలకు ఎగుమతులూ నిలిచిపోయాయి. సాధారణంగా 110 రూపాయలు ఉండే 1200 గ్రాముల చేప ధర ప్రస్తుతం 80 రూపాయలకు పడిపోయింది. వాతావరణంలో మార్పులొస్తే మరింత నష్టపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. తక్కువ ధరలకు అమ్ముకోలేక.. చేపలు, రొయ్యలను చెరువుల్లోనే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. నష్టాల నుంచి గట్టెక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
corona effect: కర్ఫ్యూ ఆంక్షల వల్ల నష్టాల్లో ఆక్వా రైతులు
కర్ఫ్యూ ఆంక్షల వల్ల ఎన్నడూ లేని నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజురోజుకూ ధరలు పడిపోతున్నాయని రవాణా సమస్యలు, కూలీల కొరత మరింత వేధిస్తోందంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
కర్ఫ్యూ ఆంక్షల వల్ల నష్టాల్లో ఆక్వా రైతులు