ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించకుంటే.. క్రాప్ హాలీడే : ఆక్వా రైతులు

ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలీడే చేపడతామని ఆక్వా రైతులు హెచ్చరించారు. ఆక్వా ఎగుమతిదారుడు, ఫీడ్ ఉత్పత్తిదారుడు సిండికేటుగా ఏర్పడి రొయ్యల రేటు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు.

ఆక్వా రైతులు
ఆక్వా రైతులు

By

Published : Jun 5, 2022, 5:15 PM IST

రొయ్యల రేటు తగ్గించటంతో తీవ్రనష్టం చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ భవనంలో సమావేశమైన ఆక్వా రైతులు.. 15 రోజుల వరకూ ఒకే రేటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫీడ్ రేటు తగ్గించి.. గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఆక్వా ఎగుమతిదారుడు, ఫీడ్ ఉత్పత్తిదారు ఇద్దరూ ఒక్కరే ఉండటంతో వారంతా సిండికేట్ అయి రొయ్యల రేట్లను ఒక్కసారిగా తగ్గించటం మేత రేట్లను పెంచడం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

ఆక్వా పరిశ్రమపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా 20 లక్షల మంది, పరోక్షంగా మరో 20లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలీడే ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నెల 11న రాష్ట స్థాయిలో ఆక్వా రైతులతో సమావేశమై కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details