పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చిట్టూరి సుబ్బారావు, పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే.. వేసవి శిక్షణా శిబిరాన్ని తణుకు సీఐ చైతన్య కృష్ణ ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఐదు సంవత్సరాలుగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో పిల్లలకు శారీరక దృఢత్వం ఉండేదని.. ఇప్పుడు అది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఐ చైతన్య కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు జయాపజయాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని ఆయన సూచించారు.
బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం - పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా శిబిరాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఐ చైతన్య కృష్ణ ప్రారంభించారు.
తణుకులో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం