పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి పక్కన బోదిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. మృతుని వయసు 29 సంవత్సరాలు ఉండొచ్చని వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి.
జాతీయ రహదారి పక్కన మృతదేహం గుర్తింపు - case
పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కన బోదిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహం