పశ్చిమగోదావరిలో ముగిసిన నామినేషన్లు పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ భారీ ఎత్తున కొనసాగింది.
నరసాపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కనుమూరిబాపిరాజు నామినేషన్ దాఖలు చేశారు.ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం... కార్యకర్తలతో కలిసి నామపత్రాలు సమర్పించారు.
ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడు, ద్వారకా తిరుమల, గుండుగొలనుకుంటగ్రామాల్లో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావు ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు . కార్యకర్తలు ప్రచార రథం ముందు వాహనాలపై భారీ ఎత్తున ర్యాలీ చేశారు. మహిళలు అడుగడుగునా ముప్పిడికి హారతులు పట్టారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ముప్పిడి ఓట్లను అభ్యర్థించారు
తణుకు నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా మల్లిన రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఉండి నియోజకవర్గం నుంచి జనసేన, సీపీఎం అభ్యర్థి డి.బలరాం, భాజపా అభ్యర్థి అల్లూరి సత్యనారాయణ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు ( వాసు బాబు), జనసేన పార్టీ అభ్యర్థి నౌడు వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి హరికుమార్ రాజు, భాజపా అభ్యర్థి ఇంటి ఉదయ్ భాస్కర్, నవ సమాజ్ పార్టీ అభ్యర్థి గడ్డం నాగ విగ్నేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థి ఉడతల వెంకటేశ్వరరావు నామపత్రాలను ఆర్వోకు సమర్పించారు.
ఇవి చదవండి
తెదేపాకు కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా