ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొదట పంచాయతీ ఎన్నికలే..! - ఏపీట స్థానిక ఎన్నికలు

రాష్ట్రంలో  తొలుత పంచాయతీ ఎన్నికలు....ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పురపాలక  ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్నింటినీ  రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం భావించినా....హైకోర్టు ఆదేశాలతో  పంచాయతీ ఎన్నికలకు  తొలుత ప్రాధాన్యమివ్వనున్నారు.

Ap panchayat elections 2020
మొదట పంచాయతీ ఎన్నికలే..!

By

Published : Nov 29, 2019, 5:55 AM IST

మొదట పంచాయతీ ఎన్నికలే..!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతూ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. మొత్తం రెండు దశల్లలోనే పంచాయతీ, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలతో పాటు....పురపాలక ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ముందుగా పంచాయతీ ఎన్నికలే నిర్వహించనున్నారు. రెండో దశలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, మూడో దశలో పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తిచేసేలా ఎన్నికల సంఘం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

జనవరిలో లేఖ రాస్తే ..!

పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో మార్చిలోగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీని ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎన్నికల సంఘానికి జనవరిలోగా ప్రభుత్వం లేఖ రాస్తే కానీ..మార్చిలోగా ప్రక్రియ పూర్తిచేసే వీలుంటుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం మార్చిలో ఎన్నికలకు ప్రకటన చేస్తే ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీల వారీగా ఈ ఏడాది మే 20న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏటా ఫిబ్రవరి 7న సవరించిన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తుంటారు. జనవరిలోగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినందున...కొత్త ఓటర్ల జాబితా అవసరం ఉండదని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదీ చదవండి :

'పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2020, మార్చి 31 నాటికి పూర్తి'

ABOUT THE AUTHOR

...view details