ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP NIT: దక్షిణాదిలో ఉత్తమ విద్యాసంస్థగా ఏపీ నిట్ - ap latest news

ఏపీ నిట్ దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ విద్యా సంస్థగా పేరు తెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన అవార్డును మంగళవారం ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు ఆన్‌లైన్‌లో అందుకున్నారు.

ap-nit-as-the-best-educational-institution-in-the-south-india
దక్షిణాదిలో ఉత్తమ విద్యాసంస్థగా ఏపీ నిట్

By

Published : Sep 8, 2021, 9:17 AM IST

దక్షిణ భారతదేశంలో ఉత్తమ విద్యా సంస్థ అవార్డును మంగళవారం ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు ఆన్‌లైన్‌లో అందుకున్నారు. న్యూదిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ గ్రోత్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన 15వ రాష్ట్రీయ శిక్షా గౌరవ్‌ పురస్కార్‌ వేడుకలో దీన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎస్పీ రావు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడంతోపాటు వారిని పరిశోధనల దిశగానూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, భవిష్యత్తులో అత్యున్నత విద్యా సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:RE ISSUE: ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details