చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్న నేతన్నలకు అండగా నిలవడానికి... ప్రభుత్వం గత సంవత్సరం 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 24 వేలు చొప్పున లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకంలో ఆరు నెలల కిందట మొదటి విడతగా జిల్లాలో 886 మందికి లబ్ధి చేకూరింది. ఈ విడతలో కొంతమంది ఒకే మగ్గంపై ఎక్కువ పేర్లు నమోదు చేయించుకున్నారని పరిశీలనలో అధికారులు గుర్తించారు. దీనివల్ల కొత్తగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఏడాదిపాటు వృత్తిలో ఉన్నవారిని పరిగణనలోనికి తీసుకోవడం, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడం వల్ల కొంత మంది లబ్ధిదారులు అనర్హుల జాబితాలో చేరారు. కరోనా ప్రభావంతో వృత్తిదారుల పరిస్థితి అంతంత మాత్రంగా మారడం వల్ల... రెండో విడత లబ్ధిని 6 నెలల ముందుగానే చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 846 మందికి రూ.2 కోట్లు పైగా లబ్ధి చేకూరనుంది.
చే'నేతన్న'లకు ఊతం... జిల్లాలో 846 మందికి లబ్ధి - పశ్చిమగోదావరి జిల్లాలో నేతన్నల తాజా వార్తలు
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం రెండో విడత అమలుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. కరోనా కారణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని చేనేత, జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలో 846 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్లు పైగా లబ్ధి చేకూరనుంది.
జనవరి నెలలో ఈ పథకం ద్వారా లబ్ధి కోసం 473 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ల దరఖాస్తులు అన్నీ అధికారుల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. కరోనా కారణంగా ఈ పథకం రెండో విడత అమలును ముందస్తుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చేనేత జౌళి శాఖ అధికారులు చెబుతున్నారు. మగ్గంపై ఏడాదిపాటు నేత నేయాలన్న నిబంధన వల్ల... కొంతమంది ఈ పథకానికి దూరమయ్యారని వివరిస్తోన్నారు. లబ్ధిదారుల అందరికీ ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి:కాసులు కొడితేనే...పేదలకు ఇళ్ల పట్టాలు..!