కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు పీహెచ్‌సీ.. ఈ ఘనత సాధించింది. దేశంలో పరిశుభ్రమైన ఆరోగ్య కేంద్రంగా వేల్పూరు పీహెచ్‌సీకి పురస్కారం దక్కింది. ఈ మేరకు... వైద్య, ఆరోగ్యశాఖ అందజేసిన నామినేషన్ల ఆధారంగా మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా... ద్వితీయ, తృతీయ స్థానంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అవార్డులు పొందాయి. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జలశక్తి మంత్రి అవార్డులను శుక్రవారం ప్రదానం చేయనున్నారు. వేల్పూరు పీహెచ్‌సీ వైద్యాధికారి సౌమ్యహరిణి పురస్కారాన్ని అందుకోనున్నారు.
స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో రాష్ట్రానికి అగ్రస్థానం - undefined
స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, వైద్యం విభాగాల్లో అందించే ఈ పురస్కారాల్లో... పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు పీహెచ్‌సీకి అగ్రస్థానం దక్కింది.
స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో ఏపీకి అగ్రస్థానం